రజినీకాంత్ మానియా మొదలైంది

రజినీకాంత్ మానియా మొదలైంది

రజినీకాంత్ సినిమాలకు, ఆయన స్టైల్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.  రజినీకాంత్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  రజిని రాజకీయాల్లోకి వస్తారని చాలాకాలం నుంచి తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.  రజిని మక్కల్ మందిరం పేరుతో పార్టీని కూడా ఏర్పాటు చేశారు.  ఈ సార్వత్రిక ఎన్నికల్లో రజిని పార్టీ పోటీ చేస్తుంది అనుకున్నారు. కానీ, రజిని అందుకు భిన్నంగా పార్టీని పోటీలో దించలేదు.  వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.  

ఇదిలా ఉంటె, రీసెంట్ గా రజినీకాంత్ రాజకీయాల గురించి సంచలనం కలిగించే వ్యాఖ్యలు చేశారు.  ఇకపై రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.  రీసెంట్ గా తమిళనాడులో 18 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపైనే ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది.  అన్నా డీఎంకే గెలిస్తే మరో రెండేళ్ల వరకు ఎన్నికలు జరగవు.  ఒకవేళ ప్రతిపక్షం గెలిస్తే... అధికారంలో ఉన్న ప్రభుత్వం పడిపోక తప్పదు.  అప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఆ ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.