రజిని.. మురుగదాస్ మూవీ లేటెస్ట్ అప్డేట్

రజిని.. మురుగదాస్ మూవీ లేటెస్ట్ అప్డేట్

రజినీకాంత్ 2పాయింట్ 0, పెట్ట సినిమాల తరువాత మురుగదాస్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.  గడిచిన రెండేళ్లలో రజినికాంత్ ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు.  ఇందులో రెండు సూపర్ హిట్ కాగా, రెండు యావరేజ్ గా నిలిచాయి.  మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయి.  

మురుగదాస్ .. రజినీకాంత్ సినిమా మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతున్నది.  సినిమా మొత్తం దాదాపుగా ముంబైలోనే జరుగుతుందట.  ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే ఆసక్తి ఉంటుంది.  కాలా సినిమా ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరుపుకుంది.  మురుగదాస్ దర్శకత్వంలో మొదటిసారి రజినీకాంత్ సినిమా చేస్తున్నాడు.  దీంతో హైప్ క్రియేట్ అయింది.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.  ఇందులో నయనతార, కీర్తి సురేష్ లు హీరోయిన్లు.  పెట్ట సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.