ఇది రజిని దర్బార్

ఇది రజిని దర్బార్

2పాయింట్ 0, పెట్ట తరువాత రజినీకాంత్ కొత్త సినిమా ప్రారంభించాడు.  తమిళ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  ఏప్రిల్ 10 నుంచి ముంబైలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు దర్బార్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు.  

ఇందులో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.  ముఖ్యంగా పోలీస్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.  రజినీకాంత్ .. మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  నయనతార ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  అనిరుద్ సంగీతం అందిస్తున్న దర్బార్ 2020 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేస్తారట.