బ్యాట్ పట్టిన తలైవా

బ్యాట్ పట్టిన తలైవా

రజినీకాంత్.. నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై నగరంలో  జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మధ్యలో తలైవా కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.  రజినీకాంత్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతుంటే.. యోగిబాబు కీపింగ్ చేస్తూ కనిపించాడు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

25 సంవత్సరాల క్రితం రజినీకాంత్ పాండియన్ అనే సినిమాలో చివరిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.  కాగా, ఇప్పుడు మరలా పోలీస్ ఆఫీసర్ పాత్ర ను చేస్తుండటం విశేషం.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.