పోలీస్ లుక్ లో రజినీకాంత్ ను చూశారా ?

పోలీస్ లుక్ లో రజినీకాంత్ ను చూశారా ?

రజినీకాంత్ దర్బార్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.  ఇందులో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా.  దాదాపు 25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.  

దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.  పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రజినీకాంత్ సూపర్బ్ గా ఉన్నారు.  రజినీకాంత్ ను చూస్తుంటే మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తున్నారు.  నయనతార హీరోయిన్.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.