మళ్ళీ సంక్రాంతిని టార్గెట్ చేసిన సూపర్ స్టార్

మళ్ళీ సంక్రాంతిని టార్గెట్ చేసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమా తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా...నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించాడు.  మురుగదాస్ తో రజినీకాంత్ సినిమా ఏప్రిల్ 10 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్.  రోబో 2పాయింట్ 0 సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  

రజినీకాంత్ ను మురుగదాస్ చాలా కొత్తగా చూపించబోతున్నాడు.  రజినీకి బాగా కలిసొచ్చిన డాన్ స్టోరీతోనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.  పేట సినిమాకు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఇచ్చిన అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.  వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.