మొన్న రంజిత్ నేడు కార్తీక్.. రజనీనా మజాకా..!!

మొన్న రంజిత్ నేడు కార్తీక్.. రజనీనా మజాకా..!!

రజినీకాంత్ తో సినిమా చేస్తున్నారంటే అది బంపర్ అఫర్ అనే అనుకోవాలి.  రజినీతో హిట్ కొడితే.. ఇక వాళ్ళ కెరీర్ కు ఢోకా ఉండదు.  సౌత్ లో సినిమా ఆఫర్లు వరసగా వస్తుంటాయి.  అవసరమైతే రజినీకాంత్ పిలిచి మరి అవకాశం ఇస్తాడు.  కబాలి విషయంలో అదే జరిగింది.  కబాలి సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు.  కానీ, పా రంజిత్ దర్శకత్వంపై రజినీకాంత్ కు అపారమైన నమ్మకం ఉంది.  రంజిత్ టాలెంట్ ను నమ్మిన రజిని కాలాతో మరోసారి అవకాశం ఇచ్చాడు.  కాలా తో మరోసారి అవకాశం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా రంజిత్ తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు అనడంలో సందేహం లేదు.  

రంజిత్ తరువాత ఇప్పుడు రజినీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ కు అవకాశం ఇచ్చారు. రజినీకాంత్ యువదర్శకులవైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణం ఏంటి..? ఇప్పటి యువతకు ఏం కావాలో యువ దర్శకులకు బాగా తెలుసు.  ఒక అనుభవానికి యువతరం జోడైతే ఎలాంటి గొప్ప ఫలితాలు ఉంటాయో గతంలో రజినీకాంత్ అనేక మార్లు నిరూపించారు.  అందుకే రజిని ఎక్కువగా యువ దర్శకులవైపే మొగ్గు చూపుతున్నారు.  ఒకవైపు సీనియర్ దర్శకులతో పనిచేస్తూ.. మరోవైపు యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ రజినీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నారు.