రజిని అభిమానులకు శుభవార్త..!!
రజినీకాంత్.. శంకర్ కాంబినేషన్ అంటే సినిమా ఇండస్ట్రీలో యమా క్రేజ్ ఉన్నది. గతంలో ఇద్దరు కలిసి శివాజీ సినిమా చేశారు. ఆ తరువాత రోబో చేశారు. రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రోబోకు కొనసాగింపుగా రోబో 2.ఓ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది. పోయిన ఏడాది దీపావళి విడుదల కావాల్సిన సినిమా విజువల్ ఎఫక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా లేట్ అయింది. అసలు సినిమా వస్తుందా రాదా అనుకుంటున్నా సమయంలో శంకర్ సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.
ఇదిలా ఉంచితే, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు సినిమాల మేకింగ్ వీడియో బిబిసిలో ప్రసారం అయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేకింగ్ వీడియోలో లేడీ రోబో అమీ జాక్సన్ గురించి చూపించారు. చిట్టి గురించి, క్రౌ మ్యాన్ గురించి అలా టచ్ చేసి వదిలేశారు. అసలు వీరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొన్నది. నవంబర్ 29 న సినిమా రిలీజ్ చేస్తారు అని ఇప్పటికే ప్రకటించారు.. అయితే, టీజర్, ట్రైలర్ సంగతి ఏంటి.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేదానిపై నిన్నటి వరకు క్లారిటీ లేదు.
ఈరోజు రోబో 2.ఓ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. వినాయకచవితి సందర్భంగా రోబో 2.ఓ టీజర్ ను రెండు వెర్షన్స్ లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. 2డి, 3డి వెర్షన్స్ లో టీజర్ ను రిలీజ్ చేస్తారట. దీంతో దీనిపై ఆసక్తి నెలకొన్నది. ఇటీవల బిబిసి లో ప్రసారమైన వీడియోకే షోకులు అద్ది దానినే టీజర్ రూపంలో రిలీజ్ చేస్తారా లేదంటే.. కొత్తగా మరో వీడియోను రిలీజ్ చేస్తారా అన్నది తెలియాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)