తమిళ ఎన్నికల్లో 'అద్భుతం' ఖాయం...రజనీ కీలక వ్యాఖ్యలు

తమిళ ఎన్నికల్లో 'అద్భుతం' ఖాయం...రజనీ కీలక వ్యాఖ్యలు


2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. కొన్నిరోజుల క్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన రజనీ మరోసారి అదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీకాంత్ చెన్నైలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మత, కుల, ఆధ్మాత్మిక పరమైన పార్టీలు తమిళనాడులో ఎప్పటికీ మనుగడ సాధించలేవని మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీ తన పార్టీ ఆధ్యాత్మిక రాజకీయ పంథాలో పయనిస్తుందని అన్నారు. దీనిపైనే జయకుమార్ విమర్శించారు. అంతకుముందు రజనీ మాట్లాడుతూ, కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంతో చెలిమి చేసే ఆలోచన ఉందని, మొదట తాను పార్టీ స్థాపించాల్సి ఉందని, ఆ తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.