రివ్యూ: 2 పాయింట్ 0

రివ్యూ: 2 పాయింట్ 0
న‌టీన‌టులు:  రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే

సంగీతం : ఏ.ఆర్ రెహమాన్ 

ఫోటోగ్రఫీ : నీరవ్ షా 

నిర్మాత : లైకా ప్రొడక్షన్స్ 

దర్శకత్వం : శంకర్ 

తలైవార్ రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందిన '2 పాయింట్ 0' సినిమా విడుదలకు ముందే బోలెడన్ని రికార్డులు క్రియేట్ చేసి ఈరోజే విడుదలైంది.  400 కోట్ల బడ్జెట్ తో మూడున్నర ఏళ్లకు పైగానే శ్రమించి శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

కథ 

ట్రైలర్లో చూపినట్టే మనుషుల చేతిలో ఉండే సెల్ ఫోన్లన్నీ మాయమైపోతుంటాయి.  ఆ హఠాత్పరిణామానికి జనం అయోమయంలో ఉండగానే పక్షి రాజు (అక్షయ కుమార్) తన ఫిఫ్త్  ఫోర్స్ తో ఎంట్రీ ఇచ్చి విధ్వంసం సృష్టిస్తుంటాడు.  అతన్ని ఆపడానికి సైంటిస్ట్ వశీకర్ తన హ్యుమనాయిడ్ రోబోట్ చిట్టీని దింపుతారు.  మరి చిట్టీ భయంకరమైన పక్షి రాజును ఎలా ఎదుర్కొంది, అసలు ఆ పక్షి రాజు ఎవరు అనేదే సినిమా. 

 
విశ్లేషణ :
దర్శకుడు శంకర్ ఛానళ్ల తర్వాత ప్రేక్షకుల అంచనా అందుకునే సినిమాని, రజినీ స్టార్ డమ్ కు సరితూగే సినిమాని రూపొందించారు.  సాంకేతికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది.  సినిమాలోని విఎఫ్ఎక్స్ చూస్తే శంకర్ మేకింగ్ కోసం   మూడున్నరేళ్ల సమయాన్ని ఎందుకు తీసుకున్నాడో అర్థమవుతుంది.  
 
ప్రతి సినిమాలోనూ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే శంకర్ ఈసారి సెల్ ఫోన్ల వలన కలిగే అనర్థాలు, వాటి పర్యవసానాలు అనే అంశంతో స్టోరీ తయారుచేసుకుని  దానికి బోలెడన్ని కమర్షియల్ అంశాల్ని జోడించి రూపొందించిన ఈ చిత్రం చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  ఫస్టాఫ్ మొత్తం పక్షి రాజు విధ్వంసంతో ఉత్కంఠభరితంగా సాగగా సెకండాఫ్లో చిట్టి ఎంట్రీ ఇచ్చి ఆ పక్షి రాజుతో తలపడటం మొదలయ్యాక సినిమా తారాస్థాయికి చేరుకుంటుంది.  అత్యంత కీలకమైన అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ భావోద్వేగానికి గురిచేస్తుంది.  ఇక చివరి 40 నిముషాల యాక్షన్ సీన్స్ అదరహో అనేలా ఉంటాయి. 
 
నటీనటుల పనితీరు :
సూపర్ స్టార్ రజినీకాంత్ వశీకర్ పాత్రలో నటుడిగా మెప్పించగా చిట్టి అప్డేట్ వెర్షన్ 2.0 పాత్రలో సరికొత్త యాక్షన్ యాటిట్యూడ్ ను ప్రదర్శించి అభిమానుల్ని ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు.  ఇక అక్షయ్ కుమార్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.  పక్షి రాజుగా క్రూరంగా కనిపించిన ఆయన ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ లో అద్భుతమైన నటన కనబర్చారు.  ఆయన పాత్ర, నటన మూలంగానే సినిమాకు బోలెడంత స్ట్రెంగ్త్ ఏర్పడింది.  ఇక హీరోయిన్ ఆమీ జాక్సన్ తో పాటు ఇతర ముఖ్య   తారాగణం పాత్రల పరిధి మేర బాగానే నటించారు. 
 
సాంకేతిక వర్గం పనితీరు : 
ఈ సినిమాను నడిపిన ప్రధాన విభాగం సాంకేతిక విభాగం.  దర్శకుడు శంకర్ కొత్త స్టోరీ లైన్ కు ఆసక్తికరమైన పాత్రల్ని, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని జోడించి చిత్రాన్ని రన్ టైమ్ ముగిసేలోపే సూపర్ హిట్ అనేలా రూపొందించారు.  ఇక విఎఫ్ఎక్స్ టీమ్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే.  హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్స్ ఇండియన్ సినిమా మేకింగ్ స్థాయి భారీగా పెరిగిందనడానికి ఉదాహరణగా నిలుస్తాయి.  ముఖ్యంగా పోరాట సన్నివేశాలు  ఔరా అనిపించేలా ఉన్నాయి.  
 
ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విజువల్స్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చి తన భాయతను పూర్తిగా నెరవేర్చాడు.  ఆంథోనీ ఎడిటింగ్, నీరవ్ షా సినిమాటోగ్రఫీ సరిగ్గా కుదిరాయి.   లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఎక్కడా వెనుకాడకుండా ఒక గొప్ప సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో బోలెడంత డబ్బును ఖర్చు పెట్టడం సినిమాలపై వారికున్న అభిరుచిని, గౌరవాన్ని గుర్తుచేస్తాయి.  
 
పాజిటివ్ పాయింట్స్ : 
స్టోరీ లైన్ 
ద్వితీయార్థంలోని ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్
రజినీ, అక్షయ్ కుమార్ల నటన  
అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్
చివరి 40 నిముషాల పోరాట సన్నివేశాలు 
వెండి తెర మీద కనిపించే భారీతనం 
 
నెగెటివ్ పాయింట్స్: 
ఫ్లాష్ బ్యాక్ మినహా ఎమోషనల్ ఎపిసోడ్స్ లేకపోవడం 
 
చివరిగా : శంకర్ ఈజ్ బ్యాక్