సైరాలో రజిని స్పెషల్ ఎంట్రీ... ?

సైరాలో రజిని స్పెషల్ ఎంట్రీ... ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.  మెగాస్టార్ తో పాటు అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, మెగా డాటర్ నిహారిక తదితరులు నటిస్తున్నారు.  చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కుతోంది.  దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  

తమిళనాడులో హైప్ తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో రజినీకాంత్ చేత ఓ చిన్న పాత్ర చేయించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఎంత చిన్న రోల్ అయినా ఫర్వాలేదు... రజినీకాంత్ అలా కనిపిస్తే చాలు... తమిళనాడులో హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.  ఇదే నిజమైతే... అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో రజిని.. చిరంజీవిలు కలిసి సినిమా చేశారు.  ఇప్పుడు ఇద్దరిని తెరపై మరలా చూడొచ్చు.