ఆ పాత్ర రజినీకాంత్ కు సెట్ అవుతుందా..?

ఆ పాత్ర రజినీకాంత్ కు సెట్ అవుతుందా..?

కాలా తరువాత రజినీకాంత్.. పిజ్జా  ఫెమ్ కార్తీక్  సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాలా విడుదల రోజునే డార్జిలింగ్ లో రజిని కొత్త సినిమా ప్రారంభమైంది.  రజిని సినిమా అనగానే ఒక స్టైల్ ఉంటుంది.  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.  మాస్ క్యారెక్టర్లు చేయడంలో రజినీకాంత్ సిద్ధహస్తుడు.  

కాగా, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో రజినీకాంత్ ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రను పోషిస్తున్నారు.  మాస్ పాత్ర కాదు.  పక్కా క్లాస్ పాత్రలో ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారట.  ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  రజినీకాంత్ కొత్త తరహా పాత్ర అనే సరికి సినిమా ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రజినీకాంత్ కు జోడిగా సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తోంది.  సన్ పిశ్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.