ఇళయరాజా స్టూడియోలో రజినీకాంత్

ఇళయరాజా స్టూడియోలో రజినీకాంత్

తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఈమధ్యే సొంతంగా స్టూడియోను నిర్మించుకున్నాడు. అత్యాధునిక హంగులతో నెలకొల్పిన ఈ స్టూడియోను ఇటీవలే ప్రారంభించారు. స్థానిక త్యాగరాయనగర్‌, కోడంబాక్కంలో దీన్ని నిర్మించారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ స్టూడియోను సందర్శించారు. ఇటీవలే ఈ స్టూడియో ప్రారంభోత్సవం రోజున పలువురు సినీ ప్రముఖలు వచ్చి ఇళయరాజాను అభినందించారు. ఆమధ్య అనారోగ్యానికి గురైన రజినీ.. కోలుకున్నా చాలా రోజుల తరువాత ఇళయరాజా స్టూడియోలో కనిపించారు. స్టూడియోలో ఇళయరాజాతో ఎక్కువ సమయం గడిపిన రజినీ ఈ స్టూడియో నిర్మాణం పట్ల ఇళయరాజాను అభినందించారు.