డిసెంబర్ 5 నుంచి రజిని వ్యూహం.. 

డిసెంబర్ 5 నుంచి రజిని వ్యూహం.. 

రజినీకాంత్ దర్బార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9 వతేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్.  ఈ సినిమా పూర్తయ్యాక రజినీకాంత్ వెంటనే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించారు.  

ఇప్పటి వరకు తమిళంలో అజిత్ తో వరసగా నాలుగు సినిమాలు చేసి విజయం సాధించిన  దర్శకుడు శివ ... రజినీకాంత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.  ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది.  దర్శకుడు శివకు వి అక్షరం కలిసి రావడంతో విఅక్షరం వచ్చేలా వ్యూహం అనే టైటిల్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది.  పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో సినిమా తెరకెక్కబోతుంది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  డిసెంబర్ 5 నుంచి సినిమా స్టార్ట్ చేసి సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  ఇందులో కీర్తి సురేష్, జ్యోతికలు నటిస్తున్నారు.  ఇక దీంతో పాటు రజినీకాంత్ తన 169 వ సినిమాను కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.  గౌతమ్ మీనన్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తారని సమాచారం.