పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్ !

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.  అలాంటి వాటిలో పోలీస్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి.  కానీ ఈమధ్య కాలంలో ఆయన పోలీస్ పాత్రలో నటించింది లేదు.  అందుకే దర్శకుడు మురుగదాస్ తన సినిమాలో రజనీని పోలీస్ పాత్రలో చూపించనున్నారట.  ఆ పాత్ర కావాల్సినంత హీరోయిజం నిండి చాలా డైనమిక్ గా ఉంటుందని వినికిడి.  అయితే ఈ విషయంపై మురుగదాస్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.