దూకుడు పెంచిన రజిని... 234 స్థానాల్లో పోటీకి సిద్ధం... 

దూకుడు పెంచిన రజిని... 234 స్థానాల్లో పోటీకి సిద్ధం... 

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 వ తేదీన పార్టీ పేరు, జనవరి 2021న పార్టీ కార్యాచరణ మొదలుపెట్టబోతున్నారు.  2021లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే సంకేతాలు పంపించారు. రజినీకాంత్ పార్టీ పెడితే ఆయనతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు అన్నాడిఎంకె, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి.  ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. అయితే, రజినీకాంత్ పార్టీ పెట్టిన తరువాత తమిళనాడులోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారని రజినీకాంత్ సలహాదారుడు మణియన్ తెలిపారు.  రజినీకాంత్ కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింహం సింగిల్ గా వస్తుంది అనే స్టైల్ లో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని సమాచారం.  రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండటంతో రాజకీయాలు తమిళరాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత మాదిరిగా రజినీకాంత్ ను కూడా తమిళప్రజలు ఆదరించి ముఖ్యమంత్రిని చేస్తారా చూడాలి..