మొదలు కాకముందే రజిని సినిమా వాయిదా..?

మొదలు కాకముందే రజిని సినిమా వాయిదా..?

2పాయింట్ 0, పెట్ట వరస హిట్స్ తరువాత రజినీకాంత్.. క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా దాదాపుగా పూర్తయ్యాయి.  ఈ నెలాఖరు నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి.  వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఇప్పటికే రజినీకాంత్ సూచించారు.  మురుగదాస్ కూడా స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.  

అయితే, వీరి ఆలోచనకు ఎన్నికలు అడ్డుకట్ట వేసింది.  నెలాఖరు నుంచే షూటింగ్ ప్రారంభమైతే..ఎన్నికల ప్రచారం, కోడ్ కారణంగా షూటింగ్ సజావుగా జరగదు. డబ్బు పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి సినిమాను ఎన్నికలు ముగిసే వరకు పోస్ట్ ఫోన్ చేసుకోవాలని యూనిట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  మే రెండో వారం నుంచి సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు సమాచారం.