ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ స‌ల్మాన్

ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ స‌ల్మాన్
దేశంలోనే అసాధార‌ణ‌మైన ఛ‌రిష్మా, మార్కెట్ వ్యాల్యూ ఉన్న ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్లు ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డ‌నున్నారు. ఒకేరోజు ఆ ఇద్ద‌రి సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో 1000 కోట్ల మేర‌ బెట్టింగ్‌కి తెర‌లేచిన‌ట్ట‌యింది. ఆ ఇద్ద‌రు స్టార్‌డ‌మ్‌కి ప‌ర్యాయ‌ప‌దాలు... ది గ్రేట్‌ ర‌జ‌నీకాంత్, స‌ల్మాన్ ఖాన్ మ‌ధ్య పోటీ ప్ర‌స్తుతం సౌత్‌-నార్త్ ఇండ‌స్ట్రీస్‌లో హాట్ టాపిక్‌. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `కాలా` ర‌క‌ర‌కాల కారణాల‌తో రిలీజ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈనెల 27న రావాల్సిన ఈ చిత్రాన్ని అనూహ్యంగా ఈద్ (జూన్ 15) వ‌ర‌కూ వాయిదా వేయ‌డంతో, ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. అయితే ఇదివ‌ర‌కే ఈద్‌కి ఫిక్స‌యిన‌ స‌ల్మాన్ `రేస్ 3`తో కాలా పోటీప‌డ‌నుంది. రెండు భారీ క్రేజీ సినిమాల క్లాష్ త‌ప్ప‌నిస‌రి అవ్వ‌డంతో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. స‌ల్మాన్ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 300-400 కోట్ల మేర సాగుతోంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ర‌జనీ సినిమా `కాలా` ప్రీరిలీజ్ బిజినెస్ స్కైలోనే ఉంది. `క‌బాలి` తిరుగులేని రిట‌ర్న్స్ ఇచ్చిన సినిమాగా రికార్డుల‌కెక్క‌డంతో.. `కాలా`కి త‌మిళనాడు, మ‌లేషియాలో భారీ బిజినెస్ జరుగుతోంద‌ని స‌మాచారం. ఓ అంచ‌నా ప్ర‌కారం 200 కోట్లు పైగానే బిజినెస్ సాగింద‌ని తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం సీన్ రివ‌ర్స్‌. ఇక్క‌డ ర‌జ‌నీ సినిమాలు వ‌రుస‌ ఫ్లాపుల వ‌ల్ల మార్కెట్ ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తాయ‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. ఒక‌వేళ అన్నిటినీ అధిగ‌మించి `కాలా` డే1 హిట్ టాక్ తెచ్చుకుంటే, ఇక్క‌డా భారీ వ‌సూళ్లు ద‌క్క‌డం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఎదురేలేని ఇద్ద‌రు గ్రేట్ స్టార్స్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడితే 1000 కోట్లు పైగా క‌లెక్ష‌న్స్ తేవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ట్రేడ్ విశ్లేషించ‌డం విశేషం.