వేసవి నుండి సూపర్ స్టార్ సినిమా !

వేసవి నుండి సూపర్ స్టార్ సినిమా !

ఈమధ్య సినిమాల వేగం పెంచిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు.  '2.0, పేట' లాంటి విజయాల తర్వాత రజనీ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  పైగా మురుగదాస్ డైరెక్షన్లో ఆయన నటించడం ఇదే మొదటిసారి.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  సినీ వర్గాల సమాచారం మేరకు ఇందులో సూపర్ స్టార్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.   ఈ సినిమా కోసం ఆయన 90 రోజుల కాల్ షీట్స్ కేటాయించారట.  ఇందులో ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది.