రజనీకాంత్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

రజనీకాంత్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

'పేట' విజయం తరవాత సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రం 'దర్బార్'.  మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్.  ఇందులో రజనీ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు.  అదొక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్.  కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందట.  త్వరలో మొదటి షెడ్యూల్ పూర్తిచేయనున్న యూనిట్ ఈ నెలాఖరులో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనుంది.  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక.  2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకానుంది.