రివ్యూ: పేట

రివ్యూ: పేట

నటీనటులు : రజినీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దీన్ 

సంగీతం :  అనిరుద్ రవిచంద్రన్ 

సినిమాటోగ్రఫి :  తిరు 

నిర్మాత : కళానిధి మారన్, అశోక్ వల్లభనేని  

దర్శకత్వం : కార్తిక్ సుబ్బరాజ్  

 '2 పాయింట్ 0' హిట్ తర్వాత రజినీకాంత్ చేసిన సినిమా 'పేట'.  తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడ ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు.  ఈరోజే సినిమా భారీ ఎత్తున విడుదలైంది.  మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..  

కథ : 

కాళీ(రజినీకాంత్) ఓకే అకాలేజ్ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తో అక్కడి సమస్యల్ని తనదైన స్టైల్లో పరిష్కరిస్తూ ఉంటాడు.  ఆ సమయంలోనే అతనికి స్థానిక గుండా ఒకరితో సమస్య వస్తుంది.  ఆ సమస్య మూలాన కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాడని తెలుస్తుంది.  అసలు కాళీ ఎవరు, ఉత్తరప్రదేశ్ నుండి ఎందుకు వచ్చాడు, అక్కడి సమస్యలతో ఎలా పోరాడాడు అనేదే సినిమా కథ.  

విశ్లేషణ :  

రజినీలోని స్టైల్, గ్రేస్, ఎనర్జీ, ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ అభిమానులు చూసి చాలా రోజులైంది.  ఈ 'పేట' సినిమా వాళ్ళ కోసమే తీసినట్టు ఉంటుంది.  సినిమాలో రజినీ పూర్తి ఎనర్జీతో ఎలాంటి పరిధులు లేకుండా స్వేచ్ఛగా నటించేశారు.  దీంతో చాలా సన్నివేశాలు అభిమానుల్ని అలరించేస్తాయి.  మొదటి అర్ధభాగం మొత్తం ఇలాంటి సన్నివేశాలు, ఎలివేషన్స్ వెంట వెంటనే వస్తూ సరదాగా సాగిపోతుంది సినిమా.  ఇంటర్వెల్ సమయానికి హీరోకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తుంది.  అది భాషా లెవల్లో ఉంటుందని అందరూ ఊహించే సమయానికి అది కాస్త రొటీన్ రివెంజ్ డ్రామాలనే ఉంటుంది.  అక్కడే ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురవుతాడు.  సెకండాఫ్ మొత్తం నెమమ్దిగా, ఫక్తు కమర్షియల్ ఫార్మట్లో పోతుంటుంది.  మధ్య మధ్యలో ఎలివేషన్స్ సీన్స్ పడినా ఓవరాల్ సెకండాఫ్ జస్ట్ ఓకే అనే రీతిలో ఉంటుంది.  ఇక పాటల విషయానికొస్తే వాటిలో రజినీ స్టైలిష్ లుక్స్ ఆకట్టుకుంటాయి.    

నటీనటుల పనితీరు : 

పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో మనం పాత రజినీని చూడొచ్చు.  సూపర్ ఎనర్జీ లెవల్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, పాత మ్యానరిజమ్స్ అన్నీ కలిసి అభిమానులకు ఐ ఫీస్ట్ అనేలా ఉన్నాడు రజినీ.  ఎంటర్టైన్మెంట్ ఉండే పాత్రలు చేయడమంటే తెగ ఎంజాయ్ చేస్తాననే రజినీ ఈ పాత్రను అలానే ఎంజాయ్ చేస్తూ చేశారు.  ఇక సిమ్రన్, త్రిషలు కొంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి మెప్పించగా విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీల పాత్రలు బలహీనంగా కొనసాగాయి.   వాటికి అంత ప్రాముఖ్యత, కథలో స్కోప్ లేకపోవడంతో వాళ్లకు నటించేందుకు ఆస్కారం దొరకలేదు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథ రాసుకున్నాడు.  రజినీని కమర్షియల్ కథలో చూపించాలనే తపనలో బలహీనమైన కథ, కథనాలు తయారుచేసుకున్నాడు.  దీంతో ముఖ్యమైన సెకండాఫ్ కొంత తెలుపోయింది.  కానీ ఫస్టాఫ్ మాత్రం పూర్తిగా రజినీ మీద నడుస్తూ అభిమానులకు ఎంజాయ్ చేయడానికి కావాల్సినంత స్టఫ్ దొరికింది.  అనిరుద్ బ్యాంక గ్రౌండ్ స్కోర్, పాటలు సంగీతం బాగున్నాయి.  తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.  మొత్తానికి సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలోనే ఉంది. 

పాజిటివ్ పాయింట్స్ : 

రజినీకాంత్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ 

ఫస్టాఫ్ ఎలివేషన్ సీన్స్ 

లవ్ ట్రాక్ 

నెగెటివ్ పాయింట్స్ : 

ఆకట్టుకోలేకపోయిన కథ, కథనం 

బలహీనమైన సెకండాఫ్ 

చివరిగా : రజినీ అభిమానులకు ప్రత్యేకం