'బాబు, కేసీఆర్‌ జవాబివ్వాలి...'

'బాబు, కేసీఆర్‌ జవాబివ్వాలి...'

తెలంగాణలో కష్టపడేవారికి కొదవ లేదని.. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే రాజకీయ పార్టీఅ కొరత ఉందని  కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ బీజేపీ పాలనలో ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని.. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన తెలంగాణ, ఆంధ్ర వంటి రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. తెలంగాణ, ఏపీలు ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆ రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలన్నారు.

మోడీ ప్రభుత్వం ఎలాంటి రోగాలు వచ్చినా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తోందని.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇక్కడ ఆ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణలో 4500 మంది రైతులు ఎందుకు చనిపోయారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని రాజ్‌నాథ్‌ నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్‌ ప్రభుత్వం సరైన విధంగా ప్రజలకు అందడం లేదన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ మైత్రి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు.