లక్నోలో రాజ్ నాథ్ సింగ్ నామినేషన్

లక్నోలో రాజ్ నాథ్ సింగ్ నామినేషన్

ఉత్తరప్రదేశ్‌ లక్నో నుంచి లోక్ సభ ఎన్నికకు బరిలోకి దిగిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా లక్నోలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రోడ్ షో నిర్వహించి.. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ కు తన నామినేషన్ పత్రాలను అందచేశారు. రాజ్ నాథ్ రోడ్ షోలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాల్గొనాల్సి ఉండగా.. ఈసీ ఆదేశాలతో ఆయన దూరంగా ఉన్నారు. లక్నో స్ధానం నుంచి గతంలో మాజీ ప్రధాని వాజ్ పాయ్ ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో యూపీ ఘాజియాబాద్‌ నుంచి గెలిచిన రాజ్‌నాథ్‌.. 2014 ఎన్నికల్లో లక్నో నుంచి విజయం సాధించారు.