ఈ బుల్‌ కూడా 'బేర్‌'మన్నాడు

ఈ బుల్‌ కూడా 'బేర్‌'మన్నాడు

షేర్‌ మార్కెట్‌లో ఇతన్ని ఇండియా వారెన్‌ బఫెట్‌ అంటారు. ఆయన పట్టిందల్లా బంగారమే. ఆయన ఫలానా కంపెనీ షేర్లు కొన్నారంటే చాలు... ఇన్వెస్టర్లు పోలో మంటూ కొనడానికి రెడీ అవుతారు. పుష్కరకాలం నుంచి ఈయన పేరు తెలియని ఇన్వెస్టర్లు మన దేశంలో లేనే లేరని చెప్పడం అతిశయోక్తి కాదేమో...  ఆయన పేరే రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా. ఇంత గొప్ప ఇన్వెస్టర్‌ కూడా ఈసారి వచ్చిన భల్లూక పట్టులో విలవిల్లాడుతున్నాడు. ఈయన కొనుగోలు చేసిన మిడ్‌ క్యాప్‌ షేర్లలో కొన్ని 75 శాతం  వరకు నష్టపోయాయని ఎకనామిక్ టైమ్స్‌ రాసింది. ఆయన మొత్తం షేర్ల విలువ సగటున 16 వాతం తగ్గింది. గడచిన నాలుగేళ్ళలో ఈయన వద్ద మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా 2014లో మొదలైన ఈ బుల్‌ రన్‌లో ఆయన షేర్లు ప్రతిఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2014లో 55 శాతం, 2015 7.4 శాతం, 2016 8 శాతం పెరిగిన ఈయన పోర్టుఫోలియో 2017లో 48 శాతం పెరిగాయి. కాని 2018 మాత్రం ఆయనకు చేదు అనుభవం మిగిల్చింది. ఝున్‌ఝున్‌వాలా షేర్లలోని 27 షేర్లలో మూడు షేర్లు మినహా అన్ని షేర్ల ధరలు ప్రతికూల ప్రతిఫలాలను ఇచ్చాయి. ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్‌, లుపిన్‌ మాత్రమే లాభాలను మిగిల్చాయి. ఆయన వద్ద ఉన్న పోర్టు ఫోలియోలో 8 షేర్లు సగానికి పడ్డాయి. మంధన రీటైల్ వెంచర్స్, జేపీ అసోసియేటర్స్, 75 శాతం క్షీణించగా, డీబీ రియాల్టి, జియో జిత్‌ ఫైనాన్సియల్‌ 60 శాతంపైగా క్షీణించాయి.