డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..!

డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత రియా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చింది అంటూ ఆరోపణలు రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. విచారణలో రియాకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రగ్స్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో విచారిస్తున్నారు. ఇక విచారణలో రియా సంచలన విషయాలు భయట పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రియా డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదికారులకు తెలిపింది. వారిలో టాలీవుడ్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ,రణవీర్ సింగ్ స్నేహితురాలి పేర్లను వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసులో అధికారులు రియా తో పాటు ఆమె తమ్ముడు శౌమిక్ చక్రవర్తిని, సుశాంత్ ఇంట్లో పనివాళ్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.