రష్మికతో విడిపోలేదని మాత్రం చెప్పలేదు !

రష్మికతో విడిపోలేదని మాత్రం చెప్పలేదు !

కొన్నిరోజులుగా హీరోయిన్ రష్మిక, ఆమె బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టిల నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని, ఇద్దరూ విడిపోయారని వార్తలు గుప్పుమంటున్నాయి.  కొందరు సోషల్ మీడియాలో ఈ విషయాన్నే చర్చిస్తూ రష్మికపై రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు.  

వీటిపై స్పందించిన రక్షిత్ శెట్టి రష్మికపై అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పారు.  దాన్ని నేను తప్పుబట్టడంలేదు.  ఎందుకంటే మనం చూసింది, విన్నదే నమ్ముతాం.  కానీ ప్రతిసారి అవి నిజాలు కావు.  రష్మిక గురించి నాకు బాగా తెలుసు, నిజానికి మీ అందరికన్నా ఎక్కువగా తెలుసు.  ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి.  రష్మికను ప్రశాంతంగా ఉండనివ్వండి.  త్వరలోనే అసలు నిజమేంటో మీకే తెలుస్తుంది.  ఆమెను జడ్జ్ చేయడం మానేయండి' అన్నారు.  ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆమెతో తాను విడిపోయారా లేక కలిసే ఉన్నారా అనేది మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్పలేదు.