షూటింగ్ స్పాట్ నుంచి మాయమైన రకుల్ !

షూటింగ్ స్పాట్ నుంచి మాయమైన రకుల్ !

సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం సంచలనాలకు తెరలేపుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రియాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి ఊహించని విధంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. రకుల్ తోపాటు. స్టార్ కిడ్ సారా అలీఖాన్ పేరుకూడా రియా బయటపెటినట్టు తెలుస్తుంది. రియా చెప్పిన పేర్లతో  టాలీవుడ్ కు షాక్ తగిలింది. ఇక రియా కాల్ లిస్ట్ లో తెలుగు తారాల పేర్లు ఉండటం సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం వికారాబాద్ శివార్లలో ఓ సినిమా షూటింగ్ లో రకుల్ పాల్గొంటుంది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో షూటింగ్ స్పాట్ నుంచి రకుల్ వెళ్లిపోయిందని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని తన ఇంటినుంచి మూడురోజుల క్రితం షూటింగ్ కు వెళ్ళింది రకుల్ . అలాగే డ్రగ్స్ వ్యవహారం పై వివరణ కోరేందుకు ఎన్టీవీ ఫోన్ చేయగా రకుల్ నిరాకరించింది. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను షేక్ చేస్తుందా..? అన్న చర్చ జరుగుతుంది.