కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన రకుల్...

కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన రకుల్...
కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై తెలుగు ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా తెలుగు అమ్మాయిలు మాధవీ లతా, శ్రీరెడ్డిలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రకుల్‌ స్పందిస్తూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పింది. దీంతో మాధవీ లతా, శ్రీరెడ్డిలు రకుల్‌పై బాహాటంగానే విమర్శలు చేశారు. ఇక తాజాగా శ్రీరెడ్డి వ్యవహారం 'మా'కు చేరటంతో ఈ వివాదం పెద్ద దుమారమే లేపింది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్‌ స్పందించింది. "నేను నా గురించి మాత్రమే చెప్పాను.. ఇతరుల గురించి నాకు తెలీదు. ఇండస్ట్రీలో నాకు ఎదురైన అనుభవాల గురించి మాత్రమే చెబుతున్నా.. నాకు కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు ఎదురుకాలేదు. నన్ను ఎవరూ వేధించలేదు. అలాంటప్పుడు దాని గురించి నేనేం మాట్లాడలేను. ఒకవేళ నేను అబద్ధాలు చెబుతున్నా అని వారనుకుంటే నేనేం చేయలేను" అని రకుల్‌ తెలిపింది. అవకాశాల కోసం ప్రయత్నించాలి కానీ తప్పుడు మార్గాలను ఎంచుకోకూడదు అని ఓ సలహా కూడా ఇచ్చింది రకుల్.