సాయి పల్లవితో సమస్య లేదన్న రకుల్ !

సాయి పల్లవితో సమస్య లేదన్న రకుల్ !

సూర్య హీరోగా సెల్వరాఘవన్ రూపొందించిన చిత్రం 'ఎన్జీకే'.  ఈ నెల 31న విడుదలకానుంది.  ఇందులో సూర్యకు జోడిగా సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించడం జరిగింది.  అయితే కథలో సాయి పల్లవి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉందని, రకుల్ రోల్ అంతంతమాత్రమేనని, అందుకే సాయి పల్లవి అంటే ఆమెకు పడటం లేదని వార్తలొచ్చాయి.  వీటిపై స్పందించిన రకుల్ తనకు, సాయి పల్లవికి మధ్యన ఎలాంటి సమస్యా లేదని, కథలో తనకుండాల్సిన ప్రాముఖ్యత తనకుందని చెప్పుకొచ్చింది.