రకుల్ బికినీలో రెచ్చిపోయిందిగా..!!!

రకుల్ బికినీలో రెచ్చిపోయిందిగా..!!!

రకుల్ ప్రీత్ సింగ్ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  కొంతకాలం క్రితం ఆఫర్లు లేక ఇబ్బందులు పడ్డ రకుల్ తరువాత బాలీవుడ్ లో దే దే ప్యార్ దే సినిమాతో మరలా లైన్లోకి వచ్చింది.  ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో మన్మధుడు 2 చేసింది.  అటు కోలీవుడ్ లో సినిమా అవకాశాలు వచ్చాయి.  బాలీవుట్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలను మెయింటైన్ చేస్తూ.. షెడ్యూల్ బిజీగా ఉన్నా.. తన రెగ్యులర్ జిమ్ విషయాన్ని మాత్రం మర్చిపోదు రకుల్.  

మన్మధుడు 2 రిలీజ్ తరువాత ఇప్పుడు స్పెయిన్ వెళ్ళింది.  అక్కడ ఇబిజి బీచ్ లో హంగామా చేస్తోంది.  మన్మథుడు 2 సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లి వచ్చిన ఈ అమ్మడు.. వచ్చిన తరువాత మరల సడెన్ గా స్పెయిన్ ఎందుకు వెళ్ళింది.  ఆ డెస్టినేషన్ ను ఎందుకు ఎంచుకుంది అనే డౌట్స్ రావొచ్చు.  ఇబిజి చాలా ప్రశాంతంగా ఉంటుందట.  అందుకే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది.  మూడు వారాలపాటు అక్కడే ఉంటుందట.  ఈనెల 29 వ తేదీన నాగార్జున తన పుట్టినరోజు వేడుకలను కుటుంబంతో సహా ఇబిజిలోనే జరుపుకోబోతున్నారు.  సో, ఆ వేడుకల్లో రకుల్ కూడా పాల్గొంటుందన్నమాట.