స్టేజ్ షోకు కోటి డిమాండ్ చేసిన అందాలభామ

స్టేజ్ షోకు కోటి డిమాండ్ చేసిన అందాలభామ

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో  ఎంట్రీ ఇచ్చిన భామ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీ.. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది.  వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ భామ ఈ మధ్య జోరు తగ్గించింది. మద్యమద్యలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన ఇప్పడు అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయని చెప్పాలి. చివరగా నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటించింది రకుల్. 

ప్రస్తుతం రకుల్  పెద్ద ఫంక్షన్స్ లో స్టేజ్ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా ఒక్క స్టేజ్ షోకి కోటి డిమాండ్ చేస్తోంది. స్టేజ్ షో లకు బాలీవుడ్ స్టార్స్ కోట్లు డిమాండ్ చేయడం మనం చూసాం . వారితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోటి వసూళ్లు చేయడం చూస్తుంటే అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది.