మొత్తానికి రకుల్ సాధించింది

మొత్తానికి రకుల్ సాధించింది

రకుల్ ప్రీత్ సింగ్ కు హిట్ లేక చాలాకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నది.  తోటి స్టార్స్ హిట్స్ కొడుతుంటే రకుల్ ఈ రేస్ లో వెనకబడిపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.  తెలుగు, తమిళంలో ప్రయత్నాలు చేసిన రకుల్... బాలీవుడ్ లో హిట్ కొట్టింది.  అజయ్ దేవగణ్ తో చేసిన దేదే ప్యార్ దే సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

రకుల్ తన అందాలతో ఆకట్టుకోడంతో పాటు నటన పరంగా కూడా పరిణితి చెందింది.  50 సంవత్సరాల వయసున్న వ్యక్తికీ గర్ల్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది.  బాలీవుడ్ లో రకుల్ హిట్ కొట్టడంతో... ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు.  ఇటు టాలీవుడ్ లో నాగార్జునతో మన్మధుడు 2 చేస్తున్నది.  ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  మే 31 వ తేదీన సూర్యతో చేసిన ఎన్జీకే కూడా రిలీజ్ అవుతున్నది.  ఈ రెండు కూడా విజయాలు సాధిస్తే మరలా రకుల్ బిజీ కావడం ఖాయమే.