చినిగిన డ్రెస్ తో చంపేసింది..!!

చినిగిన డ్రెస్ తో చంపేసింది..!!

జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా వేస్తుంది.  డబ్బుంటే కొండమీద కోతైనా దిగి వస్తుంది.  సెలెబ్రిటీలు ఏం చేసినా ఫ్యాషనే.  అందులో స్టార్ హీరోయిన్లు ఎంత కొత్తగా ట్రెండీగా కనిపిస్తే అంత పాపులారిటీ.  ఈ పాపులారిటీని క్యాష్ చేసుకొని అవకాశాలు రాబట్టుకోవడానికి మన తారలు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు.  మోడ్రన్ ట్రెండీ స్కూల్ నుంచి వచ్చిన రకుల్.. కొంత కాలం క్రితం వరకు టాప్ గేర్ లో దూసుకుపోయింది.  కొంతకాలం గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మరలా స్పీడ్ పెంచిన రకుల్ ప్రీత్.. ఇటీవల ఓ ట్రెండీ ఫ్యాషన్ లుక్ లో దర్శనం ఇచ్చింది.  

హై బ్రాండ్ బ్లూ డెనిమ్ జీన్స్ షర్ట్ వేసి కనువిందు చేసిన రకుల్.. ఔరా అనిపించింది.  ఎందుకు ఔరా అనాల్సి వచ్చిందో తెలుసా.. ఆ షర్ట్ పైభాగం చినిగిపోయి  ఉంది.  చిన్నప్పుడు స్నేహితులతో గొడవలు పడి చొక్కా చించుకున్నట్టుగా ఉన్నది.  ఆ చినిగిన షర్ట్ లోపలి నుంచి.. ఇంకొద్దులే.. చెప్పకూడదు.  మీరే చూసుకోండి.  

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి.  ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు సూర్య ఎన్.జీ.కే, కార్తీతో దేవ్, శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నది.