నాకు సమన్లు అందలేదు : రకుల్

నాకు సమన్లు అందలేదు : రకుల్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం భయట పడటంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. కాగా విచారణలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా డ్రగ్స్ సప్లై చేయినట్టు తేలడంతో ఆమెను ఎన్సీబీ అధికారులు విచారించారు. రియా,శ్రద్ధా కపూర్,దీపికా పదుకునే ,సారా అలీఖాన్,రకుల్ ప్రీత్ ల పేర్లను భయట పెట్టింది. దాంతో వారు విచారణకు హాజరవ్వాలని ఎన్సీబి అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సమన్లు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే రకుల్ మాత్రం తనకు ఎలాంటి సమన్లు అందలేదని చెపుతోంది. హైదరాబాద్ లో కానీ ముంబై లో గాని తనకు ఎలాంటి సమన్లు రాలేదని పేర్కొంది. ఈ మేరకు రియా మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేసారు. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. కాగా ఎన్సీబి అధికారులు తాము రకుల్ ను సంప్రదించడానికి అన్ని విధాలా ప్రయత్నించమని ఆమె నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. రకుల్ ప్రీత్ కావాలనే సాకులు చెబుతోందని ఆమె విచారణకు హాజరవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రకుల్ ప్రీత్ 24 న విచారణకు హాజరవ్వాల్సి ఉండగా ఆమె హైదరాబాద్ లో ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.