రకుల్ రియల్ లైఫ్ లో కూడా అలానే చేస్తుందట..!!

రకుల్ రియల్ లైఫ్ లో కూడా అలానే చేస్తుందట..!!

గతంతో పోలిస్తే రకుల్ కు అవకాశాలు తగ్గిపోతున్న సంగతి తెలిసిందే.  అటు తమిళంలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.  టాలీవుడ్ లో నాగార్జున మన్మధుడు 2 సినిమాలోనూ అలాగే, తమిళంలో ఎన్జీకే సినిమాలోనూ చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా చేస్తున్న దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ ప్రియురాలిగా నటిస్తోంది.  50 సంవత్సరాల వయసులో భార్యతో విడిపోయిన అజయ్ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రేమలో పడతాడు.  ఆతరువాత వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అన్నది కథ.  

కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తి ప్రేమలో పడే పాత్ర చాలా బాగుందని చెప్పిన రకుల్, రియల్ లైఫ్ లో కూడా అలాగే చేస్తారా అని అడిగితె.. ప్రేమకు వయసుతో పనిలేదని, ఒకవేళ తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికితే అలాగే చేస్తానని అంటోంది.