అలా చేస్తే ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది: రకుల్

అలా చేస్తే ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది: రకుల్

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టుకుంటుంది. తాజాగా ‘చెక్’ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘చెక్‌ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. భిన్నమైన పాత్ర కావటంతో చేశాను.  నేనెప్పుడూ ఆలోచించేది ఒక్కటే.. నా లాస్ట్‌ సినిమాకి, ప్రజెంట్‌ సినిమాకి కంపేర్‌ చేస్తే.. నా పర్ఫార్మెన్స్‌ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది ఇదే.. అది చెక్‌లో చాలా ఇంప్రూల్‌ అయింది. నాతోనే నాకు పోటీ’ అంటూ రకుల్ తెలిపింది. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశాను. అందులో వైష్ణవ్‌ తేజ్‌ హీరో మేమిద్దం డిఫరెంట్‌ పాత్రల్లో గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీల్లో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్‌ సినిమాలు రిపీట్‌ చేస్తే.. ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నాను’ అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.