ఒక్క హిట్ తో రకుల్ టాప్ లేపుతోంది

ఒక్క హిట్ తో రకుల్ టాప్ లేపుతోంది

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది.  ఇప్పుడు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతోంది.  కోలీవుడ్ లోను అదే పరిస్థితి.  ఇదే సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశం రావడం అక్కడ అక్షయ్ తో కలిసి చేసిన దేదే ప్యార్ దే సినిమా హిట్ కావడంతో ఆనందంలో మునిగిపోయింది రకుల్.  

ఈ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది.  మామూలుగానే రకుల్ గ్లామర్ షోలకు ఏ మాత్రం అడ్డు చెప్పదు.  బాలీవుడ్ లో అంటే ఇంక చెప్పేదేముంది.  అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది.  ఈ సినిమా తరువాత రకుల్ థింక్ మార్కెట్ అనే మ్యాగజైన్ కు ఫోటో షూట్ చేసింది.  కవర్ పేజ్ మీద అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.  టాప్ ను బ్రా తో కవర్ చేసి ఫ్యాన్ జిప్ ను గాలికి వదిలేసి స్టైల్ గా కూర్చున్న ఫోటో అది.  ఆ ఫోటోను చూస్తే ఎవరికైనా సరే మతి చెడిపోవాల్సిందే.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.