పాపం రకుల్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు..!!
రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో టాప్ హీరోయిన్. వరస సినిమాలతో దూసుకుపోతున్నది. బాలీవుడ్ లో దేదే ప్యార్ దే సినిమా హిట్ కొట్టాక సౌత్ లో మరలా ఆఫర్లు దక్కించుకుంటోంది ఈ హీరోయిన్. ఇప్పుడు టాలీవుడ్ లో నాగార్జునతో మన్మధుడు 2 సినిమా చేస్తున్నది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
ఈ హీరోయిన్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఈ అమ్మడికి క్రికెట్ అంటే పిచ్చి. ఆడకపోయినా ఇండియా ఆడే మ్యాచ్ లు అన్ని చూసేస్తుంది. వరల్డ్ కప్ లో ఇండియా అదే మ్యాచ్ లను వైట్ కలర్ టాప్ ధరించి మ్యాచ్ లు చూసిందట. అలా వైట్ కలర్ టాప్ వేసుకొని చూసిన మ్యాచ్ లను ఇండియా గెలిచింది. ఇదే సెంటిమెంట్ ను ఇండియా.. ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఫాలో అయ్యింది. కానీ, ఈ మ్యాచ్ లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడం విశేషం. సెంటిమెంట్ అన్నివేళలా వర్కౌట్ కావాలంటే కుదరదు కదా.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)