సోనమ్ ట్వీట్... పోలీసులకు బదులు రకుల్ సమాధానం..!!

సోనమ్ ట్వీట్... పోలీసులకు బదులు రకుల్ సమాధానం..!!

గత కొన్ని రోజులుగా ముంబై నగరాన్ని వానలు అతలాకుతలం చేస్తున్నాయి.  వానల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రోడ్లన్నీ అతలాకుతలం అయ్యాయి.  ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.  చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  ముఖ్యంగా ముంబై ఎయిర్ పోర్ట్.  

వానల కారణంగా ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలను నిలిపివేశారు.  దీంతో వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లో లాక్ అయ్యారు.  వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు.  సోమవారం సాయంత్రం నుంచి ఆమె ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోవాల్సి పరిస్థితి వచ్చింది.  బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఎయిర్ పోర్ట్ గురించిన సమాచారం కోసం ట్వీట్ చేసింది.  ముంబై ఎయిర్ పోర్ట్ తెరిచి ఉందొ లేదో ఎవరైనా చెప్తారా అంటూ ట్వీట్ చేసింది. పోలీసులను ట్యాగ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ కు రకుల్ స్పందించింది.  

సోమవారం రాత్రి నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ఒక్క విమానం కూడా కదలలేదు.  నేను ముంబై ఎయిర్ పోర్ట్ లోనే చిక్కుకుపోయాను అని చెప్పి సమాధానం చెప్పింది రకుల్.  ముంబై రావాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు.  అలాగే ఐదో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.