మన్మథుడి కోసం హాట్‌గా మారిన రకుల్

మన్మథుడి కోసం హాట్‌గా మారిన రకుల్

చాన్నాళ్ల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చేసిన తెలుగు చిత్రం 'మన్మథుడు 2'.  నాగార్జున ఇందులో హీరో.  రకుల్ చేస్తున్న అవంతిక పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది.  అందుకే ఆ పాత్ర కోసం రకుల్ చాలా కష్టపడ్డారు.  నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా పూర్తి సహకారాన్ని అందించారు.  

ట్రైలర్, పోస్టరర్లు చూస్తుంటేనే పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ హాట్‌గా కనిపిస్తోంది.  ఇది చూసిన ప్రేక్షకులు వీటిలోని ఇలా ఉంటే సినిమాలో ఇంకెంత హాట్‌గా కనిపిస్తుందో అనుకుంటున్నారు.  మొత్తానికి రకుల్ తన గ్లామర్ తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదలచేయనున్నారు.