పూరి ఇస్మార్ట్ హీరో ఎలా ఉన్నాడో చూడండి !

పూరి ఇస్మార్ట్ హీరో ఎలా ఉన్నాడో చూడండి !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రెజెంట్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.  పేరులో భిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాలో హీరో పాత్ర మారినట్టు భిన్నంగా ఉంటుందట.  ఈ పాత్ర కోసం ఇప్పటికే లుక్ మార్చిన రామ్ కండలు కూడా పెంచుతున్నాడు.  రెస్ట్ లేకుండా వర్కవుట్స్ చేస్తూ ఇస్మార్ట్ అనేలా తయారయ్యాడు.  వాటికి సంబందించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఈ చిత్రంలో రామ్ సరసన నాభ నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.