రాజ్ కుమార్ హిరానీతో చేయాలి 

రాజ్ కుమార్ హిరానీతో చేయాలి 

రామ్ చరణ్ తాజాగా రంగస్థలం చిత్రంతో మంచి విజయం సాధించాడు. ఇక తాజాగానే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి సినిమాలు, బాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. చరణ్ మాట్లాడుతూ బాలీవుడ్ లో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ ఉంది. ఇతని సినిమాల్లో ఆర్ట్ తో పాటు కమర్షియల్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాంటి దర్శకులు చాలా తక్కువగా ఉంటారు. అలాగే నాకు విశాల్ భరద్వాజ్ సినిమాలంటే కూడా చాలా ఇష్టం. ఈయన దర్శకత్వంలో చేయడం ఓ గౌరవంగా భావిస్తాను అని తెలిపారు. 

బాలీవుడ్ ఎంట్రీకి మీరు ఏదైనా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్నకి సమాధానంగా గతంలో జంజీర్ చిత్రం పరాజయం నుంచి చాలా నేర్చుకున్నాను. ఎప్పుడైనా మంచి కథలు వస్తే తప్పకుండా చేయాలనుకుంటున్నా. ఈ సారి కథ ఎలా ఉంది ? డైరెక్టర్, ప్రొడక్షన్ ఎవరు వంటి అంశాలపై దృష్టి పెడతాను. ముఖ్యంగా నా కంఫర్ట్ జోన్ ఉంటె సినిమా బాగా వస్తుందని నా నమ్మకం. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఏ భాషలోనైనా సినిమా చేయడానికి సిద్దమే అని చరణ్ శెలవిచ్చారు. ఇక చెర్రీ సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ కమర్షియల్ సినిమాను చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.