మంచి సినిమా ఇవ్వలేకపోయాను : చరణ్

మంచి సినిమా ఇవ్వలేకపోయాను : చరణ్

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల చిత్రం 'వినయ విధేయ రామ' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన సంగతి తెలిసిందే.  భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా పంపిణీదారులకు నష్టాల్ని మిగిల్చింది.  ఈ ఫలితంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. 

ఈ విషయాన్నే చరణ్ నేరుగా ఒప్పుకున్నాడు.  అందరినీ వినోదింపచేసే సినిమా ఇవ్వాలని చాలా ట్రై చేశాం.  కానీ దురదృష్టవశాత్తు అనుకున్నట్లు మంచి సినిమా ఇవ్వలేకపోయాం.  భవిషత్తులో మీరు మెచ్చే, మీకు నచ్చే సినిమాలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.  మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ఓపెన్ లెటర్ విడుదల చేశాడు.  భారీ పరాజయం నుండి చరణ్ త్వరగా బయటపడి రియలైజ్ అవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.