చ‌ర‌ణ్ `రాజ వంశ‌స్తుడు`

చ‌ర‌ణ్ `రాజ వంశ‌స్తుడు`
రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలోని సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసి, రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ లొకేష‌న్ ఉండ‌గానే...చాలా ముందే హిందీ శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ అమ్మ‌కం పూర్త‌యింద‌న్న వార్త అందింది. దాదాపు 22కోట్ల మేర బిజినెస్ పూర్త‌యింద‌ని, ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ చానెల్ శాటిలైట్ హ‌క్కులు ఛేజిక్కించుకుంద‌ని ప్ర‌చార‌మైంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమాకి `రాజ‌వంశ‌స్తుడు` అనే టైటిల్ ఖ‌రారైంద‌ని తెలుస్తోంది. రాజులు- రాజ్యాల‌పై తెర‌కెక్కుతున్న క్లాసిక్ సినిమా కాబ‌ట్టి, అందుకు త‌గ్గ టైటిల్ ఇదేన‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అధికారికంగా టైటిల్‌ని క‌న్ఫామ్ చేయాల్సి ఉందింకా. స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో` క‌థాంశం స్ఫూర్తితో తీస్తున్న సినిమాగా చెబుతున్నారు. త‌మ‌న్నా ఈ చిత్రంలో ఓ ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించ‌నుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.