చిరు, రామ్ చరణ్ మూవీ కన్ఫర్మ్...వారికి పండగే !

చిరు, రామ్ చరణ్ మూవీ కన్ఫర్మ్...వారికి పండగే !

మెగా ఫ్యాన్స్‌ కి పండుగ ముందే పండగ లాంటి వార్త చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ‘సైరా’ సినిమాని స్వయంగా నిర్మించి తండ్రి కలను నిజం చేశాడు హీరో రామ్ చరణ్. ఈ సినిమా గాంధీ జయంతి రోజున విడుదలై బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని కలెక్షన్ల రాబడుతోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అందరి కోరిక త్వరలోనే తీర్చబోతున్నట్టు చెప్పారు చిరు. తాను చరణ్ కలిసి నటిస్తున్నామని అయితే అది ఏ సినిమా ఎప్పుడు అన్నదానిపై పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు చిరు.

మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్టర్ `లూసిఫ‌ర్‌` తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్ చ‌ర‌ణ్ కొనడంతో ఆ సినిమానే వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమా అని అంటున్నారు. లూసిఫ‌ర్‌ లో మోహ‌న్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి పృథ్వీరాజ్ సుకుమార‌న్ రోల్‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తార‌ని టాక్‌. చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు అతిథిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే చిరు రీ-ఎంట్రీఫిల్మ్ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం `అమ్మడు లెట్స్ డు కుమ్ముడు` పాట‌లో చ‌ర‌ణ్ త‌ళుక్కున మెరిసాడు. ఈ నేప‌థ్యంలో చిరు, చ‌ర‌ణ్ పూర్తిస్థాయిలో క‌ల‌సి న‌టించ‌నుండ‌డం అభిమానులకి ఇప్పటి నుండే నిద్ర లేకుండా చేస్తోంది.