జగదేక వీరుని కి సీక్వెల్ వస్తుందా..?

జగదేక వీరుని కి సీక్వెల్ వస్తుందా..?

చిరంజీవి కెరీర్లో కొన్ని బెస్ట్ చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  భారీ వర్షాల్లో సైతం ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.  చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెప్పుకునే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.  కానీ, ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు.  

ఇప్పుడు జనరేషన్ మారింది.  చిరంజీవి, శ్రీదేవి వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇటీవలే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  ఆమె నటించిన దఢక్ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది.  అటు చిరు వారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.  మంచి కథతో సినిమా తీస్తే ఎలాంటి విజయం సాధిస్తుందో రంగస్థలం ప్రూవ్ చేసింది.  రామ్ చరణ్, జాన్వీ కపూర్ లు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ లో నటిస్తే ఎలా బాగుండాటని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఎక్కడిదో ఆగకుండా ఫ్యాన్ పోస్టర్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఇప్పుడు ఈ కొత్త జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.