వెంకీ కుమార్తె పెళ్లి వేడుకలో చరణ్ సందడి !

వెంకీ కుమార్తె పెళ్లి వేడుకలో చరణ్ సందడి !

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జైపూర్లో ఈరోజు ఘనంగా జరిగింది.  ఈ వేడుకకు సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.  వారిలో అక్కినేని కుటుంబంతో పాటు మెగా ఫామిలీ కూడా ఉంది.  రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు.  ఇకపోతే ఈ వేడుకకు కొంతమందిని మాత్రమే ఆహ్వానించిన వెంకీ త్వరలో హైదరాబాద్ వేదికగా బంధువులు, సన్నిహితులు అందరికీ భారీ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు.