దానయ్యకు చరణ్ బంపర్ అఫర్... ఎందుకంటే.. 

దానయ్యకు చరణ్ బంపర్ అఫర్... ఎందుకంటే.. 

డివివి దానయ్యతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే రెండు సినిమాలు చేశారు.  బ్రూస్ లీ, వినయ విధేయ రామ.  ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  దీంతో దానయ్యకు భారీ లాస్ వచ్చింది.  ప్రస్తుతం దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.  భారీ బడ్జెట్ తో సినిమాను తెరక్కిస్తున్నారు.  

రాజమౌళి సినిమా కావడంతో సినిమాపై నమ్మకాలు ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె, చరణ్ డివివి దానయ్యకు ఓ బంపర్ అఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  రామ్ చరణ్... త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉన్నది.  ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.  చరణ్.. త్రివిక్రమ్ సినిమాను త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది.  ఈ సంస్థతో పాటుగా డివివి సినిమా కూడా ఈ ప్రొడక్షన్ లో భాగస్వామ్యం అవుతుందని సమాచారం.  బ్రూస్ లీ, వినయవిధేయ రామ లాస్ నుంచి బయటపడేందుకు చరణ్ ఈ అఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.