రామ్ చరణ్ హ్యాట్రిక్ ఖాయమేనా..!!

రామ్ చరణ్ హ్యాట్రిక్ ఖాయమేనా..!!

రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే సింహభాగం షూటింగ్ కంప్లీట్ అయింది.  నవంబర్ 10 తో సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ కానున్నది.  నవంబర్ 9 నుంచి డబ్బింగ్ పనులు కూడా మొదలౌతాయి.  రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుంది.  ఆ రెండు పాటలను నెలాఖరులో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఎలాగైనా సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

గతంలో నాయక్, ఎవడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.  సంక్రాంతికి రాబోతున్న మూడో సినిమా కావడంతోపాటు, బోయపాటికి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగా ఉండంతో.. సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నది యూనిట్.  దీపావళి రోజున ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లేదంటే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.  రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.