రామ్ చరణ్.. మాస్టర్ చెఫ్

రామ్ చరణ్.. మాస్టర్ చెఫ్
'మెగా పవర్‌ స్టార్‌' రామ్‌చరణ్‌ తేజ్‌, దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన చిత్రం రంగస్థలం. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక రంగస్థలం సినిమా నాన్ బాహుబలి కేటగిరిలో రికార్డుల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చెవిటి పాత్రలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించడంతో.. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రామ్ చరణ్ సరసన సమంత సందడి చేసింది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ ముఖ్య పాత్ర‌లు పోషించారు. రంగస్థలం ఘన విజయం సాధించటం.. తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు కొంత సమయం ఉండటంతో ప్రస్తుతం రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో సతీమణి ఉపాసన కోసం వంట చేసి పెట్టగా.. ఆ ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'మాస్టర్ చెఫ్.. మిస్టర్ సీ.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను మా కోసం తయారుచేస్తున్నారు' అని పోస్ట్ చేసింది. అడోరల్ హస్బెండ్, రామ్ చరణ్ అనే హాష్ టాగ్స్ ను జతచేసింది. ఇక ఈ ఫోటోలలో రామ్ చరణ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.